Personal Website of Subhash Makkena

Subhash Makkena – Ideas, Works, Poems, Photos and all about his Arts

Archive for December, 2006

ఒక తీపి జ్ఞాపకం

Posted by Subhash Makkena on 25th December 2006

Chicago airport

Excuse me are you sunita?
Hai సుభాష్.. Sorry late అయినట్లు ఉన్నాను. Traffic jam అయింది. రండి కూర్చొని మాట్లాడుకుందాం.

Hmmm ఇక్కడ వద్దు. Restaurant కి వెళ్ళదామా..!
సరే.

Hmm చెప్పండి ఎలా ఉన్నాయి మీ studies.
బాగానే ఉన్నాయి. ఈ SEM తూ MS అయిపోతుంది. Internship కోసం try చేస్తున్నాను. Next SAP training ఉంది. MS అయిపోయేలోపు Job తెచ్చుకోవాలని try చేస్తున్నను. But daddy ఈలోపే పెళ్ళి చెయ్యాలనుకుంటున్నారు…మీ Job ఎలా ఉంది.

Good..బాగానే ఉంది. routinee but మంచి company. ఇంక 9 months contract ఉంది వాళ్ళతో. తర్వాత employee గా hire చేసుకుంటారు అనుకుంటున్నాను.
…………
…………
నిన్న మీ father నాతో మట్లడారు. Next april కి india వెళ్తున్నారు అట కదా. అప్పుడు మీ marriage చేసేయ్యాలని చూస్తున్నారు.

అవును..

మీరు B,Tech ఎక్కడ చేసారు

JNTU,Hyderabad లో.
JNTU లొనా … ఏ batch?
98-2002 CSE

hoo అయితే మీకు Kiran తెలుసా…hoo వడు మీకు జూనియర్ అవుతాడులే.. తెలిసి ఉండదు. వాడు నా best friend అండి.

మీ education ఎక్కడ.

నేను Btech bapatla లో చేశాను. Mechanical branch. తర్వాత Mtech CSE VIT లో చేశాను. Project work bangalore DRDOలో చేస్తుండగా ఒక Companyలో offer వచ్చింది. 1 year అక్కడే చేశాను. తర్వాత UGS, Pune లో join అయ్యాను. Indiaలో salary నచ్చలేదు.. ఇంకా ownగా company start చెయ్యాలని ambition ఉంది. US లో offshore model మీద research చేసి back india వెల్లి own company start చెయ్యాలనుకుంటున్నను. So 3-4 years ఇంకా ఇక్కడే ఉంటాను.
నెను చాలా calm. అంటే కొంచెం reserved type. తొందరగా ఎవరితో కలవను. ఒంటరిగా ఉండటం అంటే నాకు ఇష్టం. చిన్నప్పుడు నుంచి అలా అలవాటైపోయింది. Work మీద dedication ఎక్కువ. Friends అంటే పెద్దగా ఎవరూ లేరు. BTech లో ఉన్నప్పుదు ఎదో ఒక చిన్న love story ఉండేది. మామూలే.. oneside love. నిజం చెప్పాలంటే ఆ అమ్మాయి అందంగా ఉండేది. కానీ మన caste కాదు. అందుకని ఎప్పుడూ dare చెయ్యలేదు. But year endingలో తెలిసింది తనకూ నేనంటే ఇష్తమని. But అప్పటికే Time మించిపోయింది. Match fixing అయిపోయింది. America పెళ్ళి కొడుకు. హహా…….!

……………
……………
……………
……………

తర్వాత నా time అంతా Computerతోనే గడిచిపోయింది. అంతా ownగా నేర్చుకున్నాను. ఎప్పుడూ ఖాళీగా లేను. Daddyకి school, junior college ఉన్నాయి. నేను ఖాళీగా ఉంతే daddy వాటిని నాకు అప్పగిస్తాడని భయపడేవాడిని. ఏదైనా individual గా సంపాదించాలని నా కోరిక. ఆ భయంతోనే MTECHలో Join అయ్యాను. తర్వాత ఒక్క నిమిషం కూడా ఖాళిగా లేను. Immediateగా Job వచింది. తర్వాత Pune తర్వాత Dallas. అలా 4 years ఎలా గడిచిపోయయో కూడా తెలియదు.
ఇప్పుడు ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే నాకు చాలా సంతోషంగా ఉంటుంది. ఇంకా ownగా software comapny start చెయ్యలన్నది నా ambition. అది కూడా achieve చెయ్యలి.

మీ ambition definiteగా జరుగుతుంది.

……………
……………
మీ గురించి చెప్పండి.
……………
చెప్పడానికి పెద్దగా ఏమీ లేదు. మీ అంత పెద్ద ambitions నాకు లేవు. But పెళ్ళైన తర్వాత కూడా కొన్నాళ్ళు Job చెయ్యాలని నా కోరిక.
Sure… నాకు Job చేసే వాళ్ళంటేనే ఇష్టం. Lazygaa ఇంట్లో కూర్చొనే వాళ్ళంటే నాకు అసలు ఇష్టం ఉండదు. చదివిన చదువుకు విలువ ఉండాలిగా. అందునా 33% reservation తీసుకొని మరీ చదువుతారుగా మీరు.
MS చెయ్యడానికి reservation లేదు లేండి….!

Love at first sight మీద నాకు నమ్మకం లేదు కానీ… మొదటి పరిచయంలోనే మీరు అందంగా ఉన్నారని compliment ఇస్తున్నను….. And please accept that.

మీరు చాలా బాగా మాట్లాడతారు.

Soo…!
Soo..!

మీకు flight time అయింది. మళ్ళీ ఎప్పుడు కలుద్దాం?
Soo కలుద్దామా?
అవును కలుద్దాం.
Next weekend?
సరే.. ఈ రోజు cell ki call చేస్తాను.
నేను Aprilలో రెండు tickets book చేస్తాను.

Bye take care.
Dallas reach కాగానే Missed call ఇవ్వండి.
Sure
Bye

Bye

Posted in Pleasant moments | 3 Comments »

నచ్చిన వాక్యాలు

Posted by Subhash Makkena on 10th December 2006

మనసు లేని మనిషి కఠిన శిల అన్నారెవరో
మనుసున్న మనిషి కన్నీటి సెల అంటాను నేను
- ఎక్కడో చదివిన జ్ఞాపకం

Posted in Uncategorized | 1 Comment »

Farewell

Posted by Subhash Makkena on 9th December 2006

I have got my leave. Bid me farewell, my brothers!
I bow to you all and take my departure.

Here I give back the keys of my door
—and I give up all claims to my house.
I only ask for last kind words from you.

We were neighbors for long,
but I received more than I could give.
Now the day has dawned
and the lamp that lit my dark corner is out.

A summons has come and I am ready for my journey.

–Rabindranath Tagore

Posted in Uncategorized, Wrote a Poem | No Comments »

తప్పిపోయిన నక్షత్రం

Posted by Subhash Makkena on 9th December 2006

ఈ సృష్టి జరిగినప్పుడు మొదట నక్షత్రాలు ప్రకాశించాయి
వాటి అందం చూసి మేమంతా ఎంతో సంతోషించాము, పాటలు పాడుకున్నాము.

ఇంతలో ఎవరో ఒక నక్షత్రం తప్పిపోయిందని గట్టిగా అరిచారు.
అందరూ పాడటం ఆపేసారు… “అవును తప్పిపొయిన నక్షత్రం అద్భుతమైనది….”
అందరూ దానికొసం వెదుకుతున్నారు.

కానీ పరిపూర్ణమైన అందం ఎక్కడా ఉండదని నక్షత్రాలన్నీ గుసగుసలాడుకున్నాయి

Posted in Uncategorized, Wrote a Poem | No Comments »

ఇదంతా నీ ప్రేమే…!

Posted by Subhash Makkena on 9th December 2006

నాకు తెలుసు .. ఇదంతా నీ ప్రేమే…!

ఆకుల పై ఆడుతున్నా ఆ సువర్ణ కాంతి,
అప్పుడప్పుడూ నన్ను పలకరిస్తున్న ఒంటరి మేఘాలు,
నా నుదిటిని ముద్దాడుతున్న ఈ చల్లని గాలి,
నా కళ్ళని నింపేసిన ఈ ఉషోదయపు కాంతి…..!

అవును నాకు తెలుసు .. ఇదంతా నీ ప్రేమే…!

ఆకాశం నుంచి వంగి నువ్వు నా కళ్ళలోకి చూసావు
నా హృదయం నీ పాదాలను స్పృశించింది

Posted in Uncategorized, Wrote a Poem | 1 Comment »

అడగనా వద్దా..!

Posted by Subhash Makkena on 9th December 2006

ఆ కొంచెం చోటు అయినా ఉంచు నా పేరు రాసుకుంటాను
ఆ కొంచెం ఊహ అయినా మిగుల్చు అణువణువు నీదే అనుకుంటాను

నువ్వు రాసిన కొన్ని పాటలకైనా నేను రాగం చేర్చనా..?
నువ్వు గీసిన కొన్ని బొమ్మలకైనా నేను రంగు అద్దనా..?

Posted in Uncategorized, Wrote a Poem | No Comments »

ఎదురుచూస్తున్నా..!

Posted by Subhash Makkena on 9th December 2006

నువ్వు మాట్లాడకపోతే ఈ రోజు కూడా మౌనంతో నా హృదయం నింపుకుంటా!

నా కోసం రేపటి ఉషోదయం తప్పక వస్తుంది.
నీ గొంతు సువర్ణ మేఘాలను చీల్చుకుంటూ నాపై ప్రసరిస్తుంది

ఆప్పుడు నా గూటి లోని పాటలకు నీ మాటలే రెక్కలవుతాయి
ఆ పాటల రాగాలు ఈ తోటలో పూలను వికసింపచేస్తాయి.

Posted in Wrote a Poem | 1 Comment »

అందంగా లేనా అసలేం బాలేనా

Posted by Subhash Makkena on 9th December 2006

అందంగా లేనా అసలేం బాలేనా అంత లెవలేంటోయ్ నీకు mmm..?
అందంగా లేనా అసలేం బాలేనా నీ ఈడు జోడు కాననా
అలుసై పోయానా అసలేమీ కానా వేషలు చాల్లే పొమ్మనా
అందంగా లేనా అసలేం బాలేనా నీ ఈడుజొడు కాననా

కనులు కలపవాయే మనసు తెలుపవాయే
పెదవి కదపవాయే మాటవరసకే
కలికి చిలకలాగే కలత నిదురలాయే
మరువలేక నిన్నే మధన పడితినె
ఉత్తుత్తిగా చూసి ఉడికించవేలా
నువ్వొచి అడగలి అన్నట్టు నే బెట్టు చేసాను ఇన్నాళ్ళుగా //అందంగా//

నీకు మనసు ఇచ్చా ఇచ్చినపుడె నచ్చా
కనుల కబురు తెచ్చా తెలుసు నీకదీ
తెలుగు ఆడపడుచు తెలుపలేదు మనసు
మహా తెలియనట్టు నటనలే అవీ
యెన్నెల్లొ గోదారి వెన్నెల్లొ నన్నూ
తరగల్లె నురగల్లె ఏనాడు తాకేసి తడిపేసి పోలేదుగా //అందంగా//

Posted in Lyrics | No Comments »

నాకు ఇష్టమైన మాటలు

Posted by Subhash Makkena on 9th December 2006

ప్రయత్నించడం ఆగితే అది మరణం.
ప్రయత్నిస్తూ మరణిస్తే అది విజయం.
-మెగాస్టార్ చిరంజీవి

నాకు తెలిసిన ధనవంతులందరూ ఒకే విషయం నమ్ముతారు.. అది
“సంపద సృష్టించడం.. దాన్ని నలుగురికీ పంచడం”
-నేను

ప్రతి ఒక్కరిలో ఒక valentaine ఉంటాడు వాడిని చంపద్దు, లేదా ఒక్క అమ్మాయికో అబ్బాయికో అంకితం చెయ్యద్దు.
నీ కుటుంబానికి, నీ దేశానికి ఆ ప్రేమను అంకితం చెయ్యి.
అదే విశ్వజనీయమైన ప్రేమ.
- ఇది కూడా నేనే

Posted in Uncategorized | 1 Comment »

నీకోసం ఒక పేజీ

Posted by Subhash Makkena on 9th December 2006

ఎన్నిసార్లు తెరిచినా ఈ పుస్తకం నాకు ఆనందాన్నిస్తుంది.
ఎందుకంటే ఇక్కడ నువ్వుంటావు.
నా కవిత్వం ఉంటుంది.
ఇవి రెండూ కలగలిసిన మన అనుబంధం ఉంటుంది.
అందుకే ఎంత రాసినా నీకోసం ఒక పేజీ మిగిలి ఉంటుంది.

Posted in Wrote a Poem | 1 Comment »