Personal Website of Subhash Makkena

Subhash Makkena – Ideas, Works, Poems, Photos and all about his Arts

Archive for the 'Wrote a Poem' Category

అశ్రు నివేదన

Posted by Subhash Makkena on 1st March 2011

ఉదయ సంధ్యల నడుమ సాగే జీవన యానం, నిశబ్ధ నిశీధిలోనే నిలిచిపోతే బాగుండు

మదిలోని గాయాలు మరపు రాని జ్ఞాపకాలు, ఓ వెచ్చని నిట్టూర్పుతోనే మాయమైపోతే బాగుండు

అందమైన అనుభూతుల పరిమళాలు అంతమైనా, వర్తమానపు బ్రతుకు అర్ధవంతమైతే బాగుండు

భగవంతునికి జనన మరణాలు ఒక ఆటైతే, నవ్య జననం సిరినవ్వుల వరమైతే బాగుండు

ఆశ నిరాశల ఆటలాడే కాలం ఓ క్షణం ఆగి అశ్రువులకందని మరణానికి, పుష్పకల్పమైతే బాగుండు…

- Written by Mom

Posted in Wrote a Poem | No Comments »

Love .. Unconditional Love…

Posted by Subhash Makkena on 23rd July 2008

Love … Unconditional Love.. is important. Not only on humans on animals, plants and everything of this world.

Tom and Tro are my best pals. everyday when i wake up with my half opened eyes… they seems busy on gathering early sunshine. yet they wish me with a fresh smile. Everyday they inspires me… becoming greener and taller.. growing & strenghtening themselves. But they dont expect anything from me and me too.

At mid moon night while i am browsing lonliness they wispers each other. They never used to be calm, shaking their heads with every blow of wind.

Everyday they pray god… “We need thee and mother earth and most of all we need this world..”

Lastday… when sky broke into thunders Tro afraided.. shivered but Tom takes care of her. They both started life at a time.. they share themselves and they want to share everything to this world.

Angels, fairies never be happy.. nither sad.. They dont like or do like their lives… but always cherish one thing… “Being life on earth” for experiencing love, happy, surprise, sorrow, fear and death. How painful for a seed when a sprout breaks it and looks this world. How does the seed feel.. Happy..? Pain..? Never know what that feeling is… Thats a feel of god, creation. Yes.. seed is the god. We are all gods, angels, faries. We came to this earth to just explore happy love and pain.

Suddenly i want to announce to this world… We, Tom, Tro and me are the happiest beings in this universe and we are busy in exploring love and ready to take pain.

(Dedicated to my new plants Tom aka Tomato and Tro aka Cilantro. I welcome them.)

Posted in Pleasant moments, Wrote a Poem | No Comments »

ఈ రాత్రి గడవనీ..!

Posted by Subhash Makkena on 2nd February 2007

వెదికి నీకు తిరిగివ్వడానికి, ఆ జ్ఞాపకం చాల చిన్నది
అది నా గదిలోనే ఎక్కడో ఉండాలి.

గడిచిన పేజీల మధ్య,పూర్తికాని వాక్యాల చివరన తప్పకుండా దొరుకుతుంది.
(అసంపూర్తి)

Posted in Pleasant moments, Wrote a Poem | 4 Comments »

ఈ రోజు తను వచ్చింది

Posted by Subhash Makkena on 2nd February 2007

తను వచ్చి నా ప్రక్క కూర్చున్నప్పుడు నేను ఇంక నిద్రపోతూనే ఉన్నాను.
నడిరేయి జాముకి ముందే తను వచ్చింది. తను రాసిన పాటలని నా కలలు శ్రుతి చేసాయి.

అయ్యో..! నా రాత్రులన్నీ ఇలా మిగిలిపోతున్నాయెందుకు. వెచ్చని తన శ్వాసయినా నా నిద్రను తాకలేదా?

Posted in Pleasant moments, Wrote a Poem | 4 Comments »

ఈ రోజు తను వస్తుంది..!

Posted by Subhash Makkena on 30th January 2007

ఈ రోజు

ఈ రోజైనా నా గది శుభ్రపరచాలి.
చెల్లాచెదురుగా ఉన్న పూసలన్నీ మాలగా పేర్చాలి.
గదిలో చీకటి చీర చుట్టుకుంటుంది. నా దీపానికి మరికొన్ని ఆశలు చేర్చాలి.

ఎందుకంటే ఈ రోజు తను వస్తుంది..!
నడిరేయి జాము దాకా తన నిరీక్షణ

============================================
నడి రేయి

నీలి మేఘాలను అందుకొని వస్తున్న నిన్ను చూసి మురిసిపోయాను
అనంత ప్రేమ రాశులను కురిపిస్తావని ఆశ పడ్డాను.

ఠీవిగా రధం దిగివచ్చి, “నువ్వు నాకు ఏమి తీసుకొచ్చావు?” అని అడిగావు.
ఏమీ గుర్తుకు రాలేదు. పేర్చిన మాల, పరిచిన తివాచి…!అవన్ని నీకు తక్కువగా అనిపించాయి.
నా పేదరికానికి నేను సిగ్గు పడ్డాను.

కన్నీటి పొరల మధ్య..నీ రధం దూరమైంది.

అప్పుడు గుర్తుకు వచ్చింది.. నాకు ఒక హృదయముందని, అది నీకు ఇవ్వాలని.

కనుల వెంబడి వర్షం తెరిపినిచ్చింది, మీద ఉన్న కునుకుని కౌగలించుకుంది.
=============================================

ఈ రోజు

చీకటి, వేకువకు వీడ్కోలిస్తుంది.
గడిచిన రాత్రి కల అని సంజాయిషి చెబుతుంది.

ఈ రోజైనా నా గది శుభ్రపరచాలి.
చెల్లాచెదురుగా ఉన్న పూసలన్ని మాలగా పేర్చాలి.

ఎందుకంటే ఈ రోజు తను వస్తుంది..!

Posted in Pleasant moments, Wrote a Poem | 2 Comments »

Farewell

Posted by Subhash Makkena on 9th December 2006

I have got my leave. Bid me farewell, my brothers!
I bow to you all and take my departure.

Here I give back the keys of my door
—and I give up all claims to my house.
I only ask for last kind words from you.

We were neighbors for long,
but I received more than I could give.
Now the day has dawned
and the lamp that lit my dark corner is out.

A summons has come and I am ready for my journey.

–Rabindranath Tagore

Posted in Uncategorized, Wrote a Poem | No Comments »

తప్పిపోయిన నక్షత్రం

Posted by Subhash Makkena on 9th December 2006

ఈ సృష్టి జరిగినప్పుడు మొదట నక్షత్రాలు ప్రకాశించాయి
వాటి అందం చూసి మేమంతా ఎంతో సంతోషించాము, పాటలు పాడుకున్నాము.

ఇంతలో ఎవరో ఒక నక్షత్రం తప్పిపోయిందని గట్టిగా అరిచారు.
అందరూ పాడటం ఆపేసారు… “అవును తప్పిపొయిన నక్షత్రం అద్భుతమైనది….”
అందరూ దానికొసం వెదుకుతున్నారు.

కానీ పరిపూర్ణమైన అందం ఎక్కడా ఉండదని నక్షత్రాలన్నీ గుసగుసలాడుకున్నాయి

Posted in Uncategorized, Wrote a Poem | No Comments »

ఇదంతా నీ ప్రేమే…!

Posted by Subhash Makkena on 9th December 2006

నాకు తెలుసు .. ఇదంతా నీ ప్రేమే…!

ఆకుల పై ఆడుతున్నా ఆ సువర్ణ కాంతి,
అప్పుడప్పుడూ నన్ను పలకరిస్తున్న ఒంటరి మేఘాలు,
నా నుదిటిని ముద్దాడుతున్న ఈ చల్లని గాలి,
నా కళ్ళని నింపేసిన ఈ ఉషోదయపు కాంతి…..!

అవును నాకు తెలుసు .. ఇదంతా నీ ప్రేమే…!

ఆకాశం నుంచి వంగి నువ్వు నా కళ్ళలోకి చూసావు
నా హృదయం నీ పాదాలను స్పృశించింది

Posted in Uncategorized, Wrote a Poem | 1 Comment »

అడగనా వద్దా..!

Posted by Subhash Makkena on 9th December 2006

ఆ కొంచెం చోటు అయినా ఉంచు నా పేరు రాసుకుంటాను
ఆ కొంచెం ఊహ అయినా మిగుల్చు అణువణువు నీదే అనుకుంటాను

నువ్వు రాసిన కొన్ని పాటలకైనా నేను రాగం చేర్చనా..?
నువ్వు గీసిన కొన్ని బొమ్మలకైనా నేను రంగు అద్దనా..?

Posted in Uncategorized, Wrote a Poem | No Comments »

ఎదురుచూస్తున్నా..!

Posted by Subhash Makkena on 9th December 2006

నువ్వు మాట్లాడకపోతే ఈ రోజు కూడా మౌనంతో నా హృదయం నింపుకుంటా!

నా కోసం రేపటి ఉషోదయం తప్పక వస్తుంది.
నీ గొంతు సువర్ణ మేఘాలను చీల్చుకుంటూ నాపై ప్రసరిస్తుంది

ఆప్పుడు నా గూటి లోని పాటలకు నీ మాటలే రెక్కలవుతాయి
ఆ పాటల రాగాలు ఈ తోటలో పూలను వికసింపచేస్తాయి.

Posted in Wrote a Poem | 1 Comment »